కేరళలోని వాయనాడ్‌లో నేడు రాహుల్‌గాంధీ నామినేషన్‌

  • అమేథీతోపాటు దక్షిణాన పోటీ చేస్తున్న ఏఐసీసీ చీఫ్‌
  • కార్యక్రమానికి హాజరవుతున్న ప్రియాంక
  • భారీ రోడ్‌ షోకు ఏర్పాట్లు
కేరళలోని వాయనాడ్‌ పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఏఐసీసీ చీఫ్‌ రాహుల్‌ గాంధీ ఈరోజు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని సొంత నియోజకవర్గం అమేథీతోపాటు దక్షిణాది రాష్ట్రాల్లోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రాహుల్‌ నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన వాయనాడ్‌ను సురక్షిత స్ఞానంగా ఎంపిక చేసుకున్నారు.

ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 11 గంటలకు ఆయన తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల అధికారికి అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి సోదరి ప్రియాంకతోపాటు హాజరవుతున్న రాహుల్‌గాంధీ నామినేషన్‌ దాఖలు చేసే ముందు భారీ రోడ్డు షో నిర్వహించాలని నిర్ణయించారు. దీంతో ఇందుకు అవసరమైన ఏర్పాట్లు పార్టీ వర్గాలు చేపట్టాయి.
Go Back to Shorts
Kerala
Rahul Gandhi
nomination
wayanad

More Telugu News